: శబరిమల అయ్యప్ప దేవస్థానం పేరు మార్పు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం పేరును మార్చుతున్నట్టు ట్రావెన్ కోర్ బోర్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ దేవస్థానాన్ని శబరిమల శ్రీధర్మ సస్థ ఆలయంగా పిలుస్తున్నారు. ఈ పేరును శబరిమల శ్రీఅయ్యప్పస్వామి ఆలయంగా మార్చుతున్నట్టు బోర్డు ప్రతినిధులు తెలిపారు. అక్టోబర్ 5న జరిగిన బోర్డు సమావేశంలో ఆలయం పేరు మార్చాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెప్పారు. ట్రావెన్ కోర్ దేవస్వోమ్ బోర్డు పరిధిలో పలు ధర్మసస్థ ఆలయాలు ఉన్నప్పటికీ... శబరిమల ఆలయం మాత్రం అద్వితీయమైనదని వారు తెలిపారు. అయ్యప్పస్వామి కొలువై ఉన్న ఏకైక క్షేత్రం శబరిమల అని చెప్పారు. ఈ ఆలయ ప్రత్యేకతను కాపాడేందుకే పేరు మార్చినట్టు వెల్లడించారు. మరోవైపు, ట్రావెన్ కోర్ బోర్డు పరిధిలో మొత్తం 1,248 ఆలయాలు ఉన్నాయి.