: ‘పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’.. రాజ్యసభలో గందరగోళం
పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఇరు సభల్లో ఈ రోజు కూడా పెద్దనోట్ల రద్దు అంశంపై గందరగోళం నెలకొంది. పెద్దనోట్ల రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సిందేనంటూ విపక్షనేతలు పట్టుబట్టారు. అలాగే పెద్దనోట్లపై ఈ రోజు కూడా చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విపక్ష సభ్యులు ఛైర్మన్ పోడియంను చుట్టుముట్టడంతో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ రాజ్యసభను 11.30 వరకు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు లోక్‌సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.