: అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ట్రంప్ చేసే మొదటి పని ఇదేనట!
ఇంకా అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోకముందే తాను చేయబోయే పనుల గురించి ట్రంప్ చెబుతున్నారు. ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్ షిప్ ట్రేడ్ (టీపీపీ) డీల్ నుంచి అమెరికా వైదొలగుతుందని... అధ్యక్ష పదవివి చేపట్టగానే, తాను చేసే మొదటి పని ఇదేనని ట్రంప్ తెలిపారు. ఈ విషయాన్ని ఓ వీడియో సందేశం ద్వారా ఆయన వెల్లడించారు. 2015లో 12 దేశాలు టీపీపీ డీల్ కుదుర్చుకున్నాయి. ప్రపంచ మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఈ దేశాలు దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, మలేషియా, మెక్సికో దేశాలు ఈ డీల్ ను ఆమోదించలేదు. మరోవైపు, ఈ డీల్ నుంచి అమెరికా వైదొలగితే... డీల్ కు అర్థమే లేదని జపాన్ ప్రధాని షింజో అబే అన్నారు.