: రైతులు పాతనోట్లతో బ్యాంకు రుణాలు చెల్లించుకోవచ్చు: సీఎం చంద్రబాబు


రైతులు పాతనోట్లతో బ్యాంకు రుణాలు చెల్లించుకోవచ్చని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలు, కరవు ప్రాంతాల్లో సహాయక చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతు రుణాల రీషెడ్యూల్ ను 2017 జూన్ 30 వరకు పొడిగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ని కోరుతూ తీర్మానం చేశామన్నారు. కొత్త రెండు వేల నోటుతో చిల్లర సమస్య ఏర్పడుతోందని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మరో 5 వేల కోట్ల రూపాయలు పంపమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ఆ మొత్తంలో వెయ్యి కోట్ల రూపాయల వరకు వంద రూపాయల నోట్లే ఇవ్వమని కేంద్రాన్ని కోరామన్నారు. నగదు రహిత లావాదేవీలు జరిపితే ఎలాంటి సమస్యా ఉండదని, ఆలయాల హుండీల్లో వచ్చిన చిల్లరను బ్యాంకులకు జమ చేయడం ద్వారా ప్రజలకు అందించాలని సూచించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News