: తిరిగి ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే రేపటికి వాయిదాపడిన రాజ్యసభ
వాయిదా అనంతరం మూడు గంటలకు తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. నిన్న జరిగిన రైలు ప్రమాద ఘటనపై రైల్వే శాఖమంత్రి సురేష్ ప్రభు వివరణ ఇవ్వాల్సిందేనని విపక్ష సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు లోక్‌సభలో కూడా పెద్దనోట్ల అంశంపై గందరగోళం నెలకొనడంతో రేపటికి వాయిదా పడింది. ఈ రోజు ఉభయసభలు ప్రారంభమయినప్పటి నుంచి నిన్నటి రైలు ప్రమాదం అంశంపై, పాటు పెద్దనోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలనే అంశంపైనే ప్రధానంగా విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి.