: వైజాగ్ టెస్ట్... ఓటమికి చేరువలో ఇంగ్లండ్
విశాఖలో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఓటమికి చేరువయింది. క్రీజులోకి వచ్చిన బ్యాట్స్ మెన్లు కనీసం రెండంకెల స్కోరును కూడా చేరుకోకుండానే పెవిలియన్ చేరుతున్నారు. కేవలం 6 పరుగులు మాత్రమే చేసిన స్టోక్స్ జయంత్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం కీలక బ్యాట్స్ మెన్ రూట్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మెహమ్మద్ షమీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిగాడు. ప్రస్తుతం బెయిర్ స్టో (10), రషీద్ (0) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరో రెండు వికెట్లు తీసుకోగా... షమీ, జయంత్ యాదవ్ లు చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ప్రస్తుత స్కోరు 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు.