: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం.. కాన్పూర్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా ఉభయసభలు ప్రారంభమయ్యాయి. నిన్న జరిగిన కాన్పూర్ రైలు ప్రమాదంలో 133 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఉభయసభలు సంతాపం తెలిపాయి. అనంతరం నోట్ల రద్దుపై ఉభయసభల్లో చర్చకు పట్టుబడుతున్నారు. అయితే, విపక్షాల ఆందోళన మధ్యే లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సిద్ధమేనని చెప్పారు.