: నోకియా అభిమానులకు శుభవార్త.. 2017లో సరికొత్తగా మళ్లీ విపణిలోకి!
నోకియా.. ఒకప్పుడు మొబైల్ ఫోన్ ప్రపంచాన్ని ఏలిన నోకియా క్రమంగా ఎదురైన పోటీని తట్టుకోలేక చేతులు ఎత్తేసింది. స్మార్ట్‌ఫోన్ల టెక్నాలజీలో వెనకబడి, ఫీచర్ ఫోన్లకే పరిమితమై కొన్నాళ్లపాటు మార్కెట్లో కనిపించిన నోకియా.. ఆ తర్వాత పూర్తిగా కనుమరుగైంది. తాజాగా సెల్‌ఫోన్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తిరిగి విపణిలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 2017లో సరికొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌తో మార్కెట్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఈమేరకు సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. హెచ్ఎండీ నోకియాతో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకుందని నోకియా అధికారులు పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లను విడుదల చేయనున్నట్టు సంస్థ పేర్కొంది. 5.2 అంగుళాల డిస్ప్లే, 22.6 మెగాపిక్సల్ రియర్ కెమెరా వంటి ఫీచర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్టు పేర్కొంది.