: పెద్దనోట్ల రద్దుపై నా సన్నిహితుడైన రచయిత రాసిన కవిత ఇదీ: పవన్ కల్యాణ్


పెద్దనోట్ల రద్దుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక కవితను కూడా పంచుకున్నారు. ‘‘పెద్దనోట్ల రద్దుపై సామాన్యుడి స్పందన’ అని నా సన్నిహితుడైన రచయిత సాయిమాధవ్ రాసినది’ అంటూ ఈ కవితను పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు. మెతుకూ మెతుకూ కూడబెట్టి ముద్ద పోగేస్తే దొంగకూడంటున్నారన్నా నేనెట్టా బతికేది? కన్నీటి బొట్టూ బొట్టూ దాపెట్టి ఏడుపు పోగేస్తే నా ఏడుపు చెల్లదంటున్నారన్నా నేనెట్టా చచ్చేది?... అంటూ ఆ కవితలో తన ఆవేదనను ఆ రచయిత వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News