: చైనా సూపర్ సిరీస్ విజేత పివి సింధు
పివి సింధు తన కెరీర్ లో తొలిసారిగా చైనా సూపర్ సిరీస్ టైటిల్ గెలుచుకుంది. రియో ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన తర్వాత పివి సింధు అతిపెద్ద విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. ఈరోజు జరిగిన తుదిపోరులో చైనా క్రీడాకారిణి సన్ యూపై 21-11,17-21,21-11 తేడాతో సింధు విజయం సాధించింది. అరవై తొమ్మిది నిమిషాల పాటు జరిగిన తుదిపోరులో సింధు విజయం సాధించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. కాగా, గత ఏడాది డెన్మార్క్ ఓపెన్ సిరీస్ ఫైనల్ కు చేరిన సింధు, చైనా క్రీడాకారిణి లీ జ్యుర్ చేతిలో ఓటమి పాలైంది.