: 81 పరుగుల వద్ద కోహ్లీ ఔట్... ఇండియా స్కోరు 162/8


విశాఖపట్నంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఉదయం 3 వికెట్ల నష్టానికి 98 పరుగులతో ఆటను ప్రారంభించిన టీమిండియా వికెట్లు టపటపా రాలిపోయాయి. జట్టు స్కోరు 117 పరుగుల వద్ద అజింక్యా రహానే (26), 127 పరుగుల వద్ద అశ్విన్ (7), 130 పరుగుల వద్ద సాహా (2), 151 వద్ద కోహ్లీ (81) ఔట్ అయ్యారు. బ్రాడ్ బౌలింగ్ లో కుక్ కు క్యాచ్ ఇచ్చి రహానే పెవిలియన్ చేరాడు. తర్వాత బ్రాడ్ బౌలింగ్ లోనే కీపర్ బెయిర్ స్టోకు క్యాచ్ ఇచ్చి అశ్విన్ వెనుదిరిగాడు. రషీద్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు సాహా. మాంచి దూకుడు మీదున్న కోహ్లీ మరో సెంచరీ కొడతాడని అందరూ భావిస్తున్న తరుణంలో ఓ అద్భుత మైన క్యాచ్ కు అతను బలయ్యాడు. రషీద్ వేసిన బంతిని మిడాన్ లో ఆడబోయాడు కోహ్లీ. కానీ, ఎడ్జ్ తీసుకుని థర్డ్ స్లిప్ దిశగా బంతి దూసుకెళ్లింది. సెకండ్ స్లిప్ పొజిషన్ లో ఉన్న స్టోక్స్ తన కుడివైపుకు అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ ను అందుకున్నాడు. దీంతో, విరాట్ కోహ్లీ చాలా నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత జడేజా 8 పరుగులు చేసి రషీద్ బౌలింగ్ లో అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం జయంత్ యాదవ్ (8), ఉమేష్ యాదవ్ (0)లు క్రీజులో ఉన్నారు. మొత్తంమీద టీమిండియా 362 పరుగుల ఆధిక్యంతో ఉంది. ప్రస్తుతం భారత్ స్కోరు ఎనిమిది వికెట్ల నష్టానికి 162 పరుగులు.

  • Loading...

More Telugu News