: ఏటీఎంల ద్వారా డబ్బులే కాదు... సుఖవ్యాధి కారకాలు కూడా వస్తాయట!
ప్రస్తుత కాలంలో మనిషి జీవితం ఏటీఎంలతో పెనవేసుకుపోయింది. అవసరానికి డబ్బు కావాల్సినప్పుడల్లా ఏటీఎంకు వెళ్లడం మనకు నిత్యకృత్యమైంది. అయితే, ఏటీఎంల ద్వారా డబ్బులే కాదు, బ్యాక్టీరియా కూడా వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ కార్టన్ నేతృత్వంలోని బృందం 2014లో కొన్ని ఏటీఎంల బటన్ల వద్ద నుంచి డీఎన్ఏలను గ్రహించి, పరిశోధనలు జరిపింది. బటన్స్ పై ఆఫీసులు, ఇళ్లలో ఉండే బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని వీరి పరిశోధనల్లో తేలింది. దీనికి తోడు, మరుగుదొడ్లు, ఆహార పదార్థాలు, మనిషి పేగుల్లో ఉండే సూక్షక్రిములు కూడా ఉన్నాయని తెలిసింది. అంతేకాదండోయ్... సుఖవ్యాధి కారకాలు కూడా బటన్స్ పై ఉన్నట్టు వెల్లడైంది. రకరకాల జనాలు ఏటీఎంలను వాడుతుండటం వల్లే ఈ క్రిములన్నీ వాటి బటన్స్ పై తిష్ట వేస్తున్నాయని కార్టన్ తెలిపారు. ఏటీఎంలను వాడిన తర్వాత చేతులను శుభ్రపరుచుకోవాలని ఆయన సూచించారు.