: ఢిల్లీలో మరో ఘోరం... కదులుతున్న రైల్లో మహిళపై లైంగిక దాడి


దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం చోటుచేసుకుంది. పెళ్లికి వెళుతున్న ఓ మహిళపై దుర్మార్గులు లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం... షాదారా-పాత ఢిల్లీ స్టేషన్ లకు మధ్యలో కదులుతున్న రైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్లోని ఓ మహిళల కోచ్ లో కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే ఆన్నారు. అందులో నలుగురు మహిళలు షాదారాలో దిగిపోయారు. ఆ తర్వాత కోచ్ లో కేవలం ఓ 32 ఏళ్ల మహిళ మాత్రమే ఉంది. ఆ సమయంలో ఆ కోచ్ లోకి ముగ్గురు దుండగులు ప్రవేశించారు. ఆమె వద్ద ఉన్న విలువైన వస్తువులను దోచుకుని ఇద్దరు పారిపోగా... ఒకడు మాత్రం ఆమెను దారుణంగా కొట్టి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేసింది. ఈలోగా రైల్వే పోలీసులు వచ్చి, ఆ దుర్మార్గుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని షాబాజ్ (25)గా గుర్తించారు. ఓ వివాహ కార్యక్రమం కోసం బాధిత మహిళ బీహార్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News