: షాకింగ్ న్యూస్... మార్కెట్ లో భారీ ఎత్తున 2,000 రూపాయల నకిలీ నోట్లు


అప్పుడే 2,000 రూపాయల నకిలీ నోట్లు వచ్చేశాయి. ఆర్బీఐ ఈ నెల 10న మార్కెట్ లోకి విడుదల చేసిన 2,000 రూపాయలకు నకిలీ నోట్లు మార్కెట్ లోకి వచ్చేశాయి. ఈ నోట్లతో వరంగల్ లో ఓ వ్యాపారిని నిండా ముంచిన ఘరానా మోసం వెలుగు చూసింది. వరంగల్ లోని ఓ నల్ల కుబేరుడి నుంచి 20 లక్షల రూపాయల విలువైన 500, 1000 రూపాయల నోట్లు తీసుకుని, అతనికి విజయవాడ ముఠా 15,00,000 రూపాయల 2,000 రూపాయల నోట్లు ఇచ్చి, వెళ్లిపోయింది. అనంతరం ఆ నోట్లన్నీ నకిలీ నోట్లని తెలుసుకున్న సదరు నల్లకుబేరుడు వాటిని కాల్చేశాడు. అయితే కొన్ని నకిలీ నోట్లను స్థానిక టీవీ ఛానెల్ కు అందజేసి, తాను దారుణంగా మోసపోయినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News