: సత్తా లేకుండానే గెలుస్తున్నామా?: మండిపడ్డ రవిచంద్రన్ ఆశ్విన్
పిచ్ లను స్పిన్నర్లకు అనుకూలంగా తీర్చిదిద్దుతుండటం వల్లే ఇండియా విజయం సాధిస్తోందని, స్పిన్నర్లు వికెట్లు తీయడంలో రాణిస్తున్నారని వస్తున్న విమర్శలపై రవిచంద్రన్ ఆశ్విన్ మండిపడ్డాడు. తమలో సత్తా లేకుండా, పిచ్ లను మార్చడం వల్లే గెలుస్తున్నామని అంటుండటాన్ని ఆయన తప్పుబట్టాడు. ఈ తరహా విమర్శలు పదేపదే వస్తుంటే ఆటగాళ్ల మానసిక స్థైర్యం నశిస్తోందని అన్నాడు. ఈ విమర్శలకు చెక్ చెప్పాలని, స్పిన్ పైనే ఇండియా ఆధారపడి గెలుస్తోందని చెప్పడం సరికాదని హితవు పలుకుతున్నాడు. జరుగుతున్న మ్యాచ్ లను చూడకుండా ఈ తరహా విమర్శలు చేస్తున్నారని, బౌలర్లు రాణిస్తే మాత్రమే విజయాలు సాధ్యమవుతాయని చెప్పుకొచ్చాడు.