: జకీర్ నాయక్ పై బిగిసిన ఉచ్చు... ఉగ్ర చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు
వివాదాస్పద ముస్లిం మత ప్రబోధకుడు 'పీస్ టీవీ' అధిపతి, జకీర్ నాయక్ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంది. ఉగ్రవాద వ్యతిరేక నిరోధక చట్టాల కింద ఆయనపై కేసు పెట్టిన ఎన్ఐఏ, ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తన ప్రసంగాలతో యువతలో ఉగ్రవాద భావనలు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జకీర్ కు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినందునే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. కాగా, బంగ్లాదేశ్ లోని ఓ కేఫ్ పై ఉగ్రవాదులు దాడి చేసి 20 మందికి పైగా పొట్టన బెట్టుకున్న ఘటనలో, ఉగ్రవాదులు జకీర్ ప్రసంగాలతోనే ప్రభావితులైనట్టు వెల్లడైన తరువాత ఆయనపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.