: రిలయన్స్ నుంచి ఇంటర్నేషనల్ కాలింగ్ యాప్.. ప్రపంచంలోని ఏ నంబరుకైనా ఫోన్ చేసుకునే వెసులుబాటు
పిన్ నంబర్లు అవసరం లేకుండానే ప్రపంచంలోని ఏ దేశానికైనా కాల్స్ చేసుకునేలా రూపొందించిన ఇంటర్నేషనల్ కాలింగ్ యాప్‌ను రిలయన్స్ గ్లోబల్ కాల్(ఆర్జీసీ) శుక్రవారం విడుదల చేసింది. ఈ యాప్ సాయంతో టోల్‌ఫ్రీ, పిన్ నంబర్లు అవసరం లేకుండానే ప్రవంచ వ్యాప్తంగా ఏ నంబరుకైనా కాల్స్ చేసుకోవచ్చు. ఇందుకోసం వంద రూపాయలతో తొలిసారి లాగిన్ అవాల్సి ఉంటుంది. వీరికి రూ.200 టాక్ టైమ్ అందిస్తామని రిలయన్స్ కమ్యూనికేషన్‌కు అనుబంధ సంస్థ ఆర్జీసీ పేర్కొంది. నిమిషానికి రూ.1.4 చొప్పున చార్జీ వసూలు చేయనున్నట్టు తెలిపింది. అన్ని మొబైల్ ఫోన్లు, ల్యాండ్‌ఫోన్ల వినియోగదారులతోపాటు రిలయన్స్, ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఎయిర్‌సెల్, ఐడియా, టాటా, ఎంటీఎస్ నెట్‌వర్క్‌లకు చెందిన ప్రీ, పోస్టుపెయిడ్ వినియోగదారులు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సంస్థ పేర్కొంది. వెబ్‌సైట్ లేదంటే యాప్ సాయంతో ఆర్జీసీ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. గూగుల్ ప్లేస్టోర్, ఐవోఎస్ యాప్ స్టోర్ల ద్వారా ఆర్జీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రిలయన్స్ కమ్యూనికేషన్స్ సీఈవో గురుదీప్ సింగ్ తెలిపారు.