: పెద్దనోట్లు మార్చుకునేందుకు దర్జాగా వెళ్లిన మాజీ గజదొంగ!


బట్టతల, పెద్ద మీసాలు.. నుదుటిన పొడుగాటి బొట్టు.. మెడలో సెల్ ఫోన్ బ్యాగ్.. ఒక భుజానికి పాతనోట్లున్న బ్యాగ్.. మరో భుజాన తుపాకీ తగిలించుకున్న ఒక వ్యక్తి గ్వాలియర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) బ్రాంచ్ కు వెళ్లాడు. అంతే, బ్యాంకు సిబ్బంది సహా ఖాతాదారులందరూ భయపడిపోయారు. ఎందుకంటే, పెద్దనోట్లు మార్చుకునేందుకు వెళ్లింది సాధారణ వ్యక్తి కాదు, ఒకప్పటి గజదొంగ మల్కన్ సింగ్! పెద్దనోట్లను మార్చుకునే నిమిత్తం ఈ గజదొంగగారు నిన్న అక్కడికి వెళ్లారు. బ్యాంకు బయట నిలబడి ఉన్న మల్కన్ సింగ్ ను చూసేందుకు అక్కడి ప్రజలు ఆసక్తి కనబరిచారు. కాగా, 1970-80 ప్రాంతాల్లో పేరు మోసిన గజదొంగ అయిన మల్కన్ సింగ్, అతని గ్యాంగ్ పై 94 పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇందులో డెకాయిట్ కేసులు 18, కిడ్నాపింగ్ కేసులు 28, హత్యాయత్నం కేసులు 19, హత్య కేసులు 17 ఉన్నాయి. అయితే, 1983లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ముందు మల్కన్ సింగ్, అతని గ్యాంగ్ లొంగిపోయింది.

  • Loading...

More Telugu News