: పెళ్లితో ప్రపంచ రికార్డు నెలకొల్పిన 'బుల్లి' జంట!


బ్రెజిల్‌కు చెందిన పాలో గాబ్రియేల్‌ ద సిల్వా బారోస్‌ (31) ఎత్తు 90.28 సెంటీమీటర్లు, కత్యుషియా లీ హోషినో (28) ఎత్తు 91.13 సెంటీమీటర్లు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడం ద్వారా పెళ్లి రోజే ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 2006లో సామాజిక మాధ్యమాల ద్వారా వీరిద్దరికీ పరిచయమైంది. దీంతో ఛాటింగ్ ద్వారా పరిచయం పెంచుకున్న వీరిద్దరూ తొలిసారి 2008 డిసెంబర్‌ 20వ తేదీన కలుసుకున్నారు. ఆ సందర్భంగా ఒకరికోసం ఒకరు పుట్టినట్టుగా వారిద్దరూ గుర్తించారు. దీంతో వివాహ బంధం ద్వారా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. ఎనిమిదేళ్లపాటు సాగిన వీరి ప్రేమాయణం లండన్‌ లోని గిన్నిస్‌ రికార్డు ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్న చర్చిలో వివాహం చేసుకోవడం ద్వారా తీరానికి చేరింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత బుల్లిజంటగా సరికొత్త రికార్డు నెలకొల్పారు. వివాహతంతు పూర్తైన వెంటనే వారికి గిన్నిస్ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు నూతన దంపతులకు అందజేసి, అభినందించారు. దీంతో ప్రపంచంలోనే బుల్లి జంట ఆనందంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News