: ‘నో క్యాష్’ అనగానే.. బ్యాంకు అద్దాలు పగులగొట్టిన ఖాతాదారుడు
పెద్దనోట్ల మార్పిడి కోసం గంటల తరబడి ‘క్యూ’లో నిలబడి ఎట్టకేలకు క్యాష్ కౌంటర్ వద్దకు చేరిన ఒక ఖాతాదారుడితో.. ‘నో క్యాష్’ అని బ్యాంకు క్యాషియర్ చెప్పాడు. అంతే, సహనం కోల్పోయిన సదరు ఖాతాదారుడు బ్యాంకు అద్దాలను పగలగొట్టిన సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరులో జరిగింది. ఆంధ్రాబ్యాంకు మేడికొండూరు శాఖలో పెద్దనోట్లు మార్చుకునేందుకు నానాపాట్లు పడి క్యాష్ కౌంటర్ వద్దకు చేరితే.. చిన్ననోట్లు అయిపోయాయనే సమాధానం చెప్పడంతో సదరు ఖాతాదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాంకు అద్దాలను పగలగొట్టడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. దీంతో, సదరు ఖాతాదారుడికి బ్యాంకు అధికారులు, పోలీసులు సర్దిచెప్పాల్సి వచ్చింది.