: ‘అన్న’ క్యాంటీన్లను ముందుగా నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తాం: సీఎం చంద్రబాబు


‘అన్న’ క్యాంటీన్లను ముందుగా నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులతో ఈరోజు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ‘అన్న’ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని, తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందిస్తామని చెప్పారు. చౌకధరల దుకాణాలను రిటైల్ కిరాణా దుకాణాలుగా మార్చాలని, డ్వాక్రా, మెప్మా సంస్థల ఉత్పత్తులను ఇక్కడ విక్రయించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

  • Loading...

More Telugu News