: శివసేనపై మండిపడ్డ రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ.. ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్


పెద్ద నోట్ల రద్దు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కలిసి శివసేన పార్లమెంటు హాల్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలవడంపై బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్ చేసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి ఆయన సమాధానమిస్తూ, తాము బ్లాక్‌ మనీపై పోరాటానికి వ్యతిరేకం కాదని, అయితే దానిని అమలు చేస్తున్న విధానం సరిగ్గా లేదని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వాటిని కేంద్రం పట్టించుకోలేదని తాము అసంతృప్తి వ్యక్తం చేశామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News