: ఏటీఎంలు రెడీ అవుతున్నాయ్, నోట్లు ప్రింట్ అవుతున్నాయ్... నెలాఖరుకు సాధారణ స్థితి!: ప్రభుత్వ వర్గాలు
దేశవ్యాప్తంగా ఈ నెలాఖరుకు సాధారణ బ్యాంకింగ్ పరిస్థితి నెలకొంటుందని ప్రభుత్వ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. రూ. 2 వేల నోట్ల ప్రింటింగ్ ముగింపు దశకు చేరుకుందని, దేశవ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఏటీఎంలలో కొత్త నోట్లకు అనుగుణంగా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ మార్చే పనులు శరవేగంగా సాగుతున్నాయని ఉన్నతాధికారులు అంటున్నారు. మరమ్మతులు పూర్తయిన ఏటీఎంలలో 2 వేల కరెన్సీ నోట్లు వస్తాయని తెలిపారు. కాగా, నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తరువాత దేశవ్యాప్తంగా కరెన్సీ ఎమర్జెన్సీ ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా, ప్రజల్లోని అవగాహనా లేమి కారణంగానే బ్యాంకుల ముందు భారీ క్యూలు ఉంటున్నాయని అధికారులు అంటుండటం గమనార్హం.