: లోక్‌సభలో ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు.. ప్రత్యేక ప్యాకేజీపై ప్రస్తావించిన రామ్మోహన్ నాయుడు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మూడో రోజు కూడా పెద్దనోట్లపై గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. మరోవైపు లోక్‌సభలో ప్రతిపక్ష నేతల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. నిన్న కాంగ్రెస్ నేత గులాబ్ నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని అధికార పక్షనేతలు, పెద్దనోట్ల రద్దుపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేతలు నినాదాలు చేస్తున్నారు. అయినప్పటికీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను కొనసాగిస్తున్నారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీపై ప్రస్తావించారు. కేంద్రం ఇటీవల రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కావాలని తాను ప్రజల తరఫున అడుగుతున్నానని రామ్మోహన్ నాయుడు కోరారు.