: స్ప్రింగ్‌వ్యాలీలోని కామన్వెల్త్ బ్యాంకు శాఖలో బాంబు పేలుడు
ఆస్ట్రేలియా స్ప్రింగ్‌వ్యాలీలోని కామన్వెల్త్ బ్యాంకు శాఖలో బాంబు పేలుడు కలకలం రేపింది. బ్యాంకులోకి వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి బాంబు పేల్చాడు. ఈ ఘటనలో అతడికి కూడా తీవ్రగాయాలయ్యాయి. ఆ సమయంలో బ్యాంకులో ఉన్న 26 మందికి గాయాలుకాగా, వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. బాంబు పేలుడుతో బ్యాంకులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి, పొగ వచ్చింది. ఘటనా స్థలికి చేరుకున్న 25 అంబులెన్స్‌ల ద్వారా గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొంతమంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.