: చెల్లి 'సంగీత్'లో సల్మాన్ ఖాన్ తో కలసి డ్యాన్స్ చేసిన సానియా మీర్జా
సల్మాన్ ఖాన్ తో కలసి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డ్యాన్స్ అదరగొట్టింది. తన సోదరి ఆనమ్ మీర్జా వివాహ వేడుక సందర్భంగా జరిగిన సంగీత్ లో తాను రాకెట్ తో మాత్రమే కాదు, డ్యాన్స్ తోనూ మెప్పించగలనని నిరూపించింది. ‘బేబీకో బేస్ పసంద్ హై...’ పాటకు ఆమె సల్మాన్ తో కలసి నర్తించారని అసమ్ వివాహ వేడుకల్లో సంగీత్ కు కొరియోగ్రఫీ చేసిన ఆర్యన్ వెల్లడించాడు. వీరిద్దరితోపాటు పరిణీతి చోప్రా, షోయబ్ తదితరులు కూడా డ్యాన్స్ చేశారని, సెలబ్రిటీలతో పాటు సానియా బంధువులు, స్నేహితుల కోసం విడిగా మరో సంగీత్ ను కూడా నిర్వహించామని ఆయన అన్నారు.