: మీ పక్కనే క్యాష్ ఉన్న ఏటీఎం ఎక్కడుందో తెలుసుకోవాలా? ఇదిగో మార్గం!


తెల్లారి లేస్తే ఏటీఎం ఎక్కడుంది? అందులో డబ్బుందా? డబ్బున్న ఏటీఎం ఎక్కడుంది? ఎక్కడ జనాలు తక్కువగా ఉన్నారు? పొద్దున్నే ఏ ఇద్దరు కలిసినా మొదట వచ్చే చర్చ ఇదే. పెద్ద నోట్లు రద్దయిన వేళ, దైనందిన అవసరాల నిమిత్తం ఏటీఎంల నుంచి రోజుకు రూ. 2,500 వేలు తీసుకునేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నగదు నిండిన ఏటీఎంలు ఎక్కడ ఉన్నాయన్న సమాచారాన్ని తెలిపే వెబ్ సైట్లు, యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. వాటి వివరాలు... * క్యాష్ నో క్యాష్: Cashnocash.com - క్విక్కర్ మరియు నాస్ కామ్ లు కలసి దీన్ని అభివృద్ధి చేశాయి. మీ పిన్ కోడ్ సంఖ్యను ఎంటర్ చేస్తే, దగ్గర్లోని ఏటీఎం సెంటర్ల వివరాలు చెబుతూ, ఎందులో క్యాష్ ఉందన్న విషయాన్ని వెల్లడిస్తుంది. * సీఎంఎస్ ఏటీఎం ఫైండర్: దేశవ్యాప్తంగా 55 వేలకు పైగా ఏటీఎంలను నిర్వహిస్తున్న సీఎంఎస్, తాము ఎప్పుడు ఏ ఏటీఎంలో డబ్బులు ఉంచుతున్నామన్న విషయాన్ని తెలుపుతూ ఓ టూల్ ను అభివృద్ధి చేసింది. మీ రాష్ట్రాన్ని, నగరాన్ని ఎంచుకుంటే, తమ నిర్వహణలోని ఏటీఎం సెంటర్లను చూపుతుంది. * వాల్ నట్: ఇది ఓ పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్ మెంట్ యాప్. దీని ద్వారా కూడా మీ ప్రాంతంలో నగదు ఉన్న ఏటీఎంను గుర్తించవచ్చు. ఇది సుమారు 20 లక్షల మంది యూజర్లు ఇచ్చే సమాచారంపై ఆధారపడి నడుస్తుంది. ఏదైనా ఏటీఎంలో క్యాష్ చూసిన వాల్ నట్ కస్టమర్లు, విషయాన్ని మిగతావారితో పంచుకోవచ్చు. * ఏటీఎం సెర్చ్: ATMsearch.in - మీ ప్రాంతంలోని ఏటీఎంల గురించిన సమస్త సమాచారాన్ని అందించే మరో వెబ్ సైట్. ఏటీఎంలో నగదుందా? లేదా? అన్న విషయాన్ని వెల్లడించడంతో పాటు ఎంత మంది క్యూలైన్లో నిలబడి వున్నారన్న విషయాన్నీ తెలుపుతుంది.

  • Loading...

More Telugu News