: దుబాయ్ లో పనిచేస్తున్న కరీంనగర్ వాసి దుర్మరణం


దుబాయ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా వాసి దుర్మరణం చెందాడు. వెల్లటూరు మండలం అంబారిపేట గ్రామానికి చెందిన బొమ్మగాని శేఖర్ (29) బతుకుదెరువు నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం నాడూ ఫ్యాక్టరీకి వెళ్లాడు. శేఖర్ పనిచేస్తున్న సమయంలో ప్రమాదం సంభవించడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు.

  • Loading...

More Telugu News