: ఆ బచ్చాకు కేసీఆర్ ను విమర్శించే స్థాయి లేదు: నాయిని
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఓ బచ్చా అని... ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే స్థాయి ఆయనకు లేదని మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి రేవంత్ రకరకాల విన్యాసాలు చేస్తున్నారని... కానీ, ఇక్కడ టీడీపీకి నూకలు చెల్లిపోయాయని అన్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ, రాజకీయ విలువలను దిగజార్చరాదని సూచించారు. గ్యాంగ్ స్టర్ నయీంను టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే పెంచి పోషించాయని... నయీం కేసును సిట్ దర్యాప్తు చేస్తోందని... నిందితులు ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా శిక్ష తప్పదని చెప్పారు.