: ఏసీ బోగీని రిజర్వ్‌ చేసుకొని అందులో నల్లధనం, నగలు తరలించే ప్రయత్నం చేసిన అధికారి!


చెన్నైలోని ఎగ్మూర్‌ స్టేషన్‌లో నోట్ల కట్టలు, నగలతో ఉన్న హౌరా రైలులోని ప్రత్యేక బోగీని తాజాగా సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బోగీలో రైల్వే భద్రతాధికారి వాటిని త‌రలించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా వాటిని ప‌ట్టుకున్నామ‌ని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో పట్టుబడ్డ నిందితుడు ఆర్‌పీఎఫ్‌ ఐజీగా ప‌నిచేస్తోన్న ఎస్‌కే పారి అని చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు ఎస్‌కే పారి తిరుచ్చి నుంచి చెన్నై మీదుగా హౌరా వెళ్లే రైలులో ఒక ఏసీ బోగీని రిజర్వ్‌ చేసుకుని ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడని అధికారులు తెలిపారు. ఈ కేసులో తాము స్వాధీనం చేసుకున్న బోగీలో ఉన్న‌ నల్లధనం, నగలు ఎవ‌రికి చెందిన‌వ‌నే విష‌యంపై అధికారులు ఆరాతీస్తున్నారు.

  • Loading...

More Telugu News