: కోహ్లీ హాఫ్ సెంచరీ... 100 దాటిన భారత స్కోరు
విశాఖలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత జట్టు పరుగుల వేట నిదానంగా సాగుతోంది. ఆదిలోనే 6 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ ను, ఆపై 22 పరుగుల వద్ద మరో ఓపెనర్ మురళీ విజయ్ వికెట్ ను కోల్పోయిన ఇండియాను కెప్టెన్ కోహ్లీ, పుజారాలు ఆదుకున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ నిదానంగా స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కోహ్లీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 50, పుజారా 42 పరుగుల వద్ద కొనసాగుతుండగా, భారత స్కోరు 37 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు.