: ప్రజల ఇబ్బందులపై మోదీ సమాధానం చెప్పాల్సిందే... లోక్‌సభలో విపక్షాల పట్టు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాల్సిందేనని లోక్‌సభలో విపక్షాలు పట్టువదలడం లేదు. పెద్దనోట్ల రద్దుపై కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, విపక్షాల ఆందోళన మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తోన్న నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.