: పార్లమెంటు సమావేశాలు ప్రారంభం... గందరగోళం.. రాజ్యసభ వాయిదా
పార్లమెంటు శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఇరు సభలు ప్రారంభం కావడమే ఆలస్యం.. ప్రతిపక్షాలు పెద్దనోట్ల రద్దుపై చర్చకు పట్టుబట్టాయి. రాజ్యసభలో రెండో రోజు కూడా పెద్దనోట్లపై చర్చ జరగాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, డిప్యూటీ ఛైర్మన్ కురియన్ అందుకు ఒప్పుకోకపోవడంతో ఆయన పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభను 11.30వరకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దుపై లోక్‌సభలో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు, ప్రజల ఇబ్బందులపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.