: ‘ఊరట’.. పెళ్లి ఖర్చుల కోసం రూ.2.5 లక్షలు విత్ డ్రా చేసుకోవచ్చు: కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి
బ్యాంకుల నుంచి తమ అకౌంట్లో పడిన లోన్ల నుంచి రైతులు వారానికి 25,000 రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... వివాహ వేడుకల కోసం గుర్తింపు కార్డు చూపి రూ.2.5 లక్షల రూపాయలు విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పారు. అలాగే గుత్త వ్యాపారులు వారానికి బ్యాంకుల నుంచి రూ.50 వేలు విత్ డ్రా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.