: ఆదిలోనే ఎదురుదెబ్బ... 6 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన భారత్
విశాఖపట్నంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. బ్రాడ్ విసిరిన గుడ్ లెంగ్త్ బంతి రాహుల్ బ్యాట్ ఎడ్జ్ కి తగిలి థర్డ్ స్లిప్ లోకి వెళ్లింది. ఆ క్యాచ్ ను థర్డ్ స్లిప్ లోని స్టోక్స్ అందుకోవడంతో రాహుల్ పెవిలియన్ చేరాడు. మరో ఎండ్ లో మురళీ విజయ్ 11 పరుగులతో, వన్ డౌన్ బ్యాట్స్ మెన్ పుజారా 2 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత ప్రస్తుత స్కోరు వికెట్ నష్టానికి 13 పరుగులు.