: రామోజీరావు ఆ మార్గంలోనే పయనిస్తున్నారు!: వెంకయ్యనాయుడు
సమకాలీన మీడియాతో పాటు పెరిగిపోతున్న సామాజిక మాధ్యమాల విస్తృతిని కూడా గుర్తించాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ప్రెస్ కౌన్సిల్ స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, గొప్ప పాత్రికేయ విలువలను పాటించడంలో రామ్ నాథ్ గోయెంకా, సి.ఆర్.ఇరాని అనుసరించిన మార్గాలు తనకు గుర్తుకు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ‘ఈనాడు’ గ్రూపు అధినేత రామోజీరావు ఆ మార్గంలోనే పయనిస్తున్నారని వెంకయ్య ప్రశంసించారు.