: పెద్దనోట్ల రద్దును ప్రసవవేదనతో అభివర్ణించిన వెంకయ్య


పెద్దనోట్ల రద్దును ప్రసవవేదనతో అభివర్ణించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. నోట్ల రద్దుపై ప్రతిపక్ష నేతలు రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు వెంకయ్యనాయుడు తనదైన శైలిలో సమాధాన మిచ్చారు. పెద్దనోట్ల రద్దు కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని అన్నారు. అయితే, ప్రసవవేదన తర్వాత శిశువు జన్మించి కేక పెట్టిన తర్వాత ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆనందిస్తారన్నారు. అదే విధంగా, నోట్ల రద్దు తర్వాత చేకూరే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని, అయితే, తాత్కాలిక ఇబ్బందులు ప్రజలకు తప్పవని అన్నారు.

  • Loading...

More Telugu News