: రాజ్య‌స‌భ రేపటికి వాయిదా.. మొదటి రోజు పెద్ద నోట్ల రద్దుపైనే కొనసాగిన చర్చ


పార్లమెంటు శీతాకాల స‌మావేశాల్లో మొద‌టి రోజు రాజ్య‌స‌భలో మొత్తం పెద్ద నోట్ల ర‌ద్దు అంశంపైనే చ‌ర్చ జ‌రిగింది. రాజ్య‌స‌భ‌లో ఈ రోజు వెంక‌య్యనాయుడు పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంపై ప్ర‌సంగించిన వెంట‌నే స‌భ‌ను వాయిదా వేస్తున్నట్లు రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ కురియ‌న్ తెలిపారు. సభ మళ్లీ రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల తరువాత మరోసారి రాజ్యసభలో పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చించే అవకాశం ఉంది. మొదటి రోజు రాజ్యసభలో విపక్ష నేత‌లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర‌మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంక‌య్య‌నాయుడు స‌మ‌ర్థ‌వంతంగా స‌మాధానాలు చెప్పారు. పెద్ద‌నోట్ల అంశం నేప‌థ్యంలో త‌మ ప్ర‌భుత్వం పూర్తి స్ప‌ష్ట‌త‌తో ఉంద‌ని వారు చెప్పారు.

  • Loading...

More Telugu News