: సోనియాకు కుశల ప్రశ్నలు వేసిన మోదీ
శీతాకాల సమావేశాలకు లోక్ సభకు హాజరైన ప్రధాని నరేంద్రమోదీ తమ పార్టీ నేతలతో పాటు మిత్రపక్షాల వారిని కూడా పలుకరించారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, రాంవిలాస్ పాశ్వాన్, అశోక్ గజపతిరాజులను పలకరించారు. అనంతరం హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ తో కలిసి ప్రతిపక్ష నాయకులు ఉన్న వైపు వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని మోదీ పలకరించారు. ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కుశల ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు సుదీప్ బందోపాధ్యాయ, కల్యాణ్ బెనర్జీలతో మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లను మోదీ పలకరించారు. కాగా, సోనియాతో రాజ్ నాథ్ సింగ్ చాలా సేపు మాట్లాడారు.