: ప్రధాని గారూ, ఏం త్యాగం చేశారో చెప్పండి?: ఆనంద్ శర్మ
ప్రధాని నరేంద్ర మోదీ టీవీ ముందుకు వస్తే చాలు, నోటికేది వస్తే అది మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ మండిపడ్డారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దుతో తనను చంపాలని చూస్తున్నారని మోదీ అంటున్నారు... ఎన్నికల సందర్భంగా 36 అంగుళాల ఛాతీ చూపించిన ధైర్యం ఏమైందని ఆయన నిలదీశారు. ప్రధానిని చంపేవారు దేశంలో ఎవరున్నారు? అని ఆయన ప్రశ్నించారు. 'ప్రతిసారి ప్రధాని త్యాగం చేశాను, త్యాగం చేశాను అంటున్నారు. అన్నీ త్యాగం చేసిన వ్యక్తి ఎవరి డబ్బులతో విదేశీ పర్యటనలు చేస్తున్నారు? ఎవరి డబ్బులతో సౌకర్యాలు పొందుతున్నారు? గంగానదిలో కొట్టుకొస్తున్న వెయ్యి రూపాయల నోట్లన్నీ నల్ల కుబేరులవేనంటున్నారు... అవన్నీ సాధువులవేనని ఎందుకు గుర్తించడం లేదు?' అని ఆయన ప్రశ్నించారు. మీరు ఏకపక్షంగా కొంత మందికి మాత్రమే తెలిసేలా తీసుకున్న నిర్ణయంతో తండ్రులు కుమార్తెలకు వివాహం చేసుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వివాహాలు రద్దు చేసుకుంటున్నారని, ఆసుపత్రుల్లో శవాలు కూడా బయటకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.