: 'నిర్భయ' నిందితులకు ఉరిశిక్షకు తగ్గ వయసు లేదు: సుప్రీంకోర్టులో అమికస్ క్యూరి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో ఉరిశిక్ష పడిన నలుగురు నిందితుల వయసు చాలా తక్కువని, వారికి గతంలో ఎలాంటి నేర నేపథ్యం లేదని, వారిని ఉరితీసేందుకు తగిన వయసు లేదని అమికస్ క్యూరీ రాజూ రామచంద్రన్ కీలకమైన సూచనలు చేశారు. నిందితులు ముకేష్ (24), పవన్ (20), వినయ్ (22), అక్షయ్ (29)లకు గతంలో మరణశిక్ష పడ్డ సంగతి తెలిసిందే. దీన్ని ఢిల్లీ హైకోర్టు సైతం ధ్రువీకరించింది. ఇక దోషులు సుప్రీంకోర్టులో తీర్పును సవాల్ చేయగా, అమికస్ క్యూరీ వాదనలు వినిపిస్తూ, వీరంతా చిన్నవారేనని, వారి పట్ల సానుకూల వైఖరితో ఉండాలని కోరడం గమనార్హం.