: షాక్... 41 కోట్ల మంది రహస్య రాసలీలలు లీకైపోయాయి!


భారత దేశాన్ని 500, 1000 రూపాయల నోట్ల రద్దు వ్యవహారం పట్టికుదిపేస్తుండగా, ప్రపంచాన్ని మరో వ్యవహారం కుదిపేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ లీక్ సంచలనం రేపుతోంది. గతంలో కలకలం రేపిన లీకులకంటే ఈసారి వెల్లడైన లీక్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు కుటుంబాల్లో చిచ్చురేపడం ఖాయంగా కనిపిస్తోంది. 2013లో 'మై స్పేస్'కి చెందిన 36 కోట్ల అక్రమ సంబంధాల ఎకౌంట్స్ లీకయి పెద్ద కుదుపుకుదిపాయి. తమ రహస్యం బట్టబయలు కావడంతో అప్పట్లో చాలా మంది భర్తలు, భాగస్వాముల నుంచి విడిపోగా, అవమానం భరించలేని కొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిని మించిన లీకేజీ ఇప్పుడు జరిగిందని, 41 కోట్ల మంది రాసలీలలు, అక్రమ సంబంధాలు బట్టబయలయ్యాయని ఇంటర్నెట్ సెక్యూరిటీ లోపాల్ని బయటపెట్టే 'లీక్డ్ సోర్స్' అనే వెబ్‌ సైట్ ప్రకటించింది. ఇంటర్‌నెట్ యూజర్లు పెరిగిపోవడం, సామాజిక మాధ్యమాల ప్రాభవం పెరిగిపోవడంతో పలు ఆన్‌ లైన్ శృంగార సైట్లు పుట్టుకొచ్చాయి. వీటిలో సరికొత్త అనుబంధాల కోసం చాలా మంది వెంపర్లాడుతున్నారు. ఇలాంటి వారికోసం నెలకొల్పిన అడల్ట్ ఫ్రెండ్ ఫైండర్.కామ్ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయిన 40,22,14,295 మంది యూజర్ల సమాచారం లీకైంది. ఫలానా యూజర్ సెక్స్ అలవాట్లు ఏమిటి? అతను వివాహేతర సంబంధాల్ని ఇష్టపడుతున్నారా? వంటి అత్యంత సున్నితమైన సమాచారం మొత్తం ఆ డేటాబేస్ లో ఉందని లీక్డ్ సోర్స్ ప్రకటించింది. సాధారణంగా ఇలాంటి రహస్య సమాచార సేకరణ బ్లాక్ మెయిల్ చేసేందుకు యూజర్ల బర్త్‌ డేలు, ఐపీ అడ్రస్‌ లు ఆధారం చేసుకుని జరుగుతుందని, అందుకే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వెబ్ సైట్ లో లీకైన సమాచారంలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న వ్యక్తులతో పాటు, గతంలో మెంబర్లుగా ఉండి, అందులోనుంచి బయటకు వచ్చేసిన వారి వివరాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇలా లీకైన సమాచారం కేవలం అడల్ట్ ఫ్రెండ్ ఫైండర్ వెబ్ సైట్ ది మాత్రమే కాకుండా, ఇందులో ఇంకా కేమ్స్.కాం, పెంట్ హౌస్.కాం, స్ట్రిప్ షో.కాం, ఐకేమ్స్.కాం వంటి పలు వెబ్ సైట్ల సమాచారం ఉందని తెలుస్తుండగా, సింహభాగం మాత్రం అడల్ట్ ఫ్రెండ్ ఫైండర్ దేనని సమాచారం. ఈ మొత్తం లీకైన సమాచారంలో అడల్ట్ ఫ్రెండ్ ఫైండర్.కాంకి సంబంధించిన 33.98 కోట్ల మందికి చెందిన సమాచారం ఉండడం విశేషం. కేమ్స్.కాం వెబ్ సైట్ వినియోగదారులకు సంబంధించిన 6.27 కోట్ల మంది వివరాలు ఉన్నాయి. ఇక పెంట్ హౌస్.కాంలో సభ్యులైన 71.8 లక్షల మంది సీక్రెట్స్ బట్టబయలైపోయాయి. స్ట్రిప్ షో.కాం లో అనుబంధం పెట్టుకున్న 14.2 లక్షల మంది వివరాలు, ఐకేమ్స్.కాంలోని 11.3 కోట్ల మంది రహస్య సంబంధాలు, ఇతర అనుబంధ వెబ్ సైట్లకు చెందిన మరో 35,000 మంది వివరాలు లీకయ్యాయి. ఈ శృంగార రహస్యాల లీక్‌ ని బయటపెట్టిన లీక్డ్ సోర్స్ చెబుతున్నదేంటంటే... ‘‘మేము హ్యాకర్స్ కాదు. ఇంటర్ నెట్లో సెక్యూరిటీ పరంగా ఉన్న సమస్యల్ని గుర్తించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడమే మా పని!” అన్నారు. తాము కూడా సెక్యూరిటీ పరమైన సమస్యలు చెప్పడానికే వీటిన హ్యాక్ చేశామని చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున రహస్య సంబంధాల వివరాలు వెల్లడి కావడంతో అంతా షాక్ కు గురవుతున్నారు. ప్రపంచంలో ఇంత పెద్ద లీక్ లేదని...ఈ లీకే ప్రపంచంలో అతిపెద్ద ఇంటర్నెట్ లీక్ అని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News