: దేశాన్ని రక్షించడంలో వీరజవాను హనుమంతప్పను ఆదర్శంగా తీసుకోండి: సెహ్వాగ్ సలహా
టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దేశ ప్రజలకు స్పూర్తివంతమైన సూచన చేశాడు. ట్విట్టర్ ద్వారా అభిమానులను అలరించే సెహ్వాగ్...క్యూలైన్లలో నిల్చున్న దేశ ప్రజలనుద్దేశించి... కాపాడబడతాననే ఆశతో వీర జవాను హనుమంతప్ప సియాచిన్ లో మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, 35 అడుగుల లోతున ఆరు రోజులపాటు అలాగే ఉన్నాడు... మనం కూడా దేశ రక్షణ కోసం కొంత సమయం పాటు బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిల్చోగలమని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది.