: మోదీ చెప్పిన ధనికులు వీరే... పేదలంతా ఇళ్లల్లో ఉన్నారు: చిదంబరం సెటైర్
ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సెటైర్లు వేశారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై మోదీ వివరణ ఇస్తూ... ఈ నిర్ణయం వల్ల నల్లకుబేరులు నిద్రమాత్రలు వేసుకుంటున్నారని, పేదలంతా కంటినిండా కునుకు తీస్తున్నారని పేర్కొనడంపై... ట్విట్టర్ ద్వారా స్పందించిన చిదంబరం...'అవును నిజమే, ప్రధాని చెప్పినట్టు వేలాది మంది ధనికులు, అవినీతి పరులు క్యూల్లో నిల్చున్నారు. పేదలు తమ ఇళ్లలో నుంచి వారిని చూస్తూ ఆనందిస్తున్నారు' అని ఎద్దేవా చేశారు. 'లక్షలాది మంది క్యూల్లో నిల్చున్నారు. ఉత్పత్తి జిందాబాద్' అన్నారు. మంచి రోజులు (అచ్ఛేదిన్) వస్తాయని ప్రదాని హామీ ఇచ్చినట్టు 'బ్యాంకులు వేసే ముష్టి కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. అచ్ఛేదిన్ కు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?' అని అడిగారు.