: ఒక్క దేశం కాదు... నాకు మొత్తం ప్రపంచం కావాలి: ప్రియాంక చోప్రా


తాను బాలీవుడ్ చిత్రాల్లో ఇప్పటికీ నటిస్తున్నానని... అయితే తనకు ఒక్క దేశం సరిపోవడం లేదని, ప్రపంచం మొత్తం కావాలని నటి ప్రియాంక చోప్రా తెలిపింది. భారత్ ను వదిలి అమెరికా రావడం కొంత బాధగానే ఉందని చెప్పింది. "ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నా. నాతో పాటు నా కుటుంబం లేదు. స్నేహితులు లేరు. అయినప్పటికీ నేను కంఫర్టబుల్ గా ఉండేందుకు అవసరమైనవన్నీ నా తోటి నటులు, క్రూ సభ్యులు చూసుకుంటున్నారు. మన పండుగలను కూడా కలిసి జరుపుకున్నాం" అని తెలిపింది. ప్రియాంక ప్రస్తుతం క్వాంటికో సీజన్ 2 షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ షూటింగ్ న్యూయార్క్ లో జరుగుతోంది.

  • Loading...

More Telugu News