: శభాష్.. మోదీ తల్లి ఆదర్శం!.. బ్యాంకుకు వచ్చి నోట్లు మార్చుకున్న హీరాబెన్!
దేశంలో నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికట్టేందుకు ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేస్తూ కొత్త నోట్లను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన కొడుకు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఈ రోజు గుజరాత్‌లోని గాంధీనగర్ లో ఉన్న ఓ బ్యాంకు వద్దకు తన వద్ద ఉన్న పాతనోట్లను చేతపట్టుకొని వచ్చారు. బ్యాంకు ముందు కొద్ది సేపు కుర్చీలో కూర్చొని వేచి చూశారు. ఆమెకు పలువురు సాయం అందించడంతో కుర్చీ నుంచి లేచి బ్యాంకులోకి వచ్చి, క్యాష్ కౌంటర్‌లో ఉన్న బ్యాంకు సిబ్బందికి తన వద్ద ఉన్న 4,500 రూపాయల రద్దయిన నోట్లు ఇచ్చి కొత్త నోట్లు తీసుకున్నారు. రెండు రెండు వేల నోట్లు, మిగతావి వేరే చిల్లర నోట్లు తీసుకుని మీడియాకు చూపించారు.