: ఈ వారంలోనే ట్రంప్ కేబినెట్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన కేబినెట్ ను ఈ వారంలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అధికార బదిలీ వ్యవహారాలకు సలహాదారుగా ఉన్న జాసన్ మిల్లర్ ఈ విషయాన్ని తెలిపారు. కేబినెట్ కు తుది మెరుగులు దిద్దే పనిలో ట్రంప్ ఉన్నారని... కేబినెట్ జాబితా ఈ వారంలో ఎప్పుడైనా ప్రకటించవచ్చని చెప్పారు. ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మైక్ పెన్స్ ఈ రోజు న్యూయార్క్ కు వస్తున్నారని, ట్రంప్ తో ఆయన భేటీ అవుతారని వెల్లడించారు. కేబినెట్ పై వీరిద్దరూ లోతుగా చర్చించనున్నారని... తుది ప్రకటన వెలువడేంత వరకు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయరాదని, మీడియా కూడా దాన్ని స్వీకరించరాదని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఊహాగానాలు వెల్లువెత్తే అవకాశం ఉందని చెప్పారు.