: నేను గిల్ క్రిస్ట్ ను కాదు...నాలో అతడిని చూసుకోను: సౌతాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్


తాను విధ్వంసక కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఆడమ్‌ గిల్‌ క్రిస్ట్‌ ను కాదని సౌతాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ స్పష్టం చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ లో సెంచరీ చేసిన డికాక్‌ ఒకప్పటి గిల్ క్రిస్ట్ ను గుర్తు తెచ్చాడు. బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన డికాక్ ను అంతా గిల్లీలా బ్యాటింగ్ చేశానని కీర్తించడంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో తాను గిల్లీని కాదని స్పష్టం చేశాడు. కనీసం గిల్ క్రిస్ట్ ఆటను అనుకరించే ప్రయత్నం కూడా చేయనని తెలిపాడు. తాను ఆరంభం నుంచి ఆడే విధానమే ఇంత అని చెప్పాడు. తనలో అతనిని చూసుకోనని ప్రకటించాడు. తాను కేవలం బంతిని మాత్రమే చూసి ఆడతానని, తనకంటూ ఆటలో కొన్ని ప్రణాళికలు ఉన్నాయని డికాక్ తెలిపాడు. సాధారణంగా మేటి క్రీడాకారుడితో ఎవరినైనా పోల్చితే గొప్పగా ఫీలవుతారు. కానీ తన ప్రత్యేకత తనదేనని డికాక్ గర్వంగా చెప్పడం అతని ఆత్మవిశ్వాసానికి ప్రతీక...కాగా, ఈ క్రీడా సంవత్సరంలో డికాక్‌ 80 సగటుతో ఇప్పటికే 540 పరుగులు చేయడం విశేషం.

  • Loading...

More Telugu News