: నేడే అపోలో నుంచి జయలలిత డిశ్చార్జ్?


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభిమానులకు శుభవార్త... సెప్టెంబర్ 22న ఊపిరితిత్తుల సమస్యతో జయలలిత చెన్నయ్ అపోలో ఆసుపత్రి అత్యవసర విభాగంలో చేరిన సంగతి తెలిసిందే. వైద్యుల అత్యాధునిక చికిత్స, అభిమానుల ప్రార్థనలతో ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నేడు అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఆసుపత్రి నుంచి పోయెస్ గార్డెన్ లోని తన నివాసానికి వెళ్లి ఆమె విశ్రాంతి తీసుకొననున్నట్టు తెలుస్తోంది. కాగా, అభిమానుల ప్రార్థనలు, పూజలు, వైద్యుల నిరంతర పర్యవేక్షణతోనే తాను సంపూర్ణంగా కోలుకుంటున్నానని జయలలిత ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆమె కోలుకోవడంతో తమిళనాట ఉపఎన్నికల్లో విజయం తమదేనని అన్నాడీఎంకే పార్టీ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News