: బ్యాంకుల వద్ద క్యూ లైన్లలో ఉన్నవారికి మజ్జిగ పంపిణీ చేస్తున్నాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
పెద్దనోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు సహజమేనని, వాటిని అధిగమించేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు విజయవాడలో బ్యాంకర్లు, ప్రభుత్వాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ... బ్యాంకు ముందు క్యూ లైన్లలో ఉన్నవారికి మజ్జిగ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. బ్యాంకర్లతో కలిసి ప్రభుత్వాధికారులు సమన్వయంగా పని చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ సంస్థలు డిజిటల్ చెల్లింపులను స్వీకరించేందుకు యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నామని చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడా పెరగలేదని, వదంతులను నమ్మకూడదని చెప్పారు.